కర్ణాటక రాజధాని బెంగళూరులోని పులకేశినగరలో ఓ నటిపై దాడి జరిగింది. నటి హర్షిక పుణచ్చ తన భర్త భువన్‌తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు చేశారు. ఈ ఘటనపై ఆణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తక్షణమే స్పందించకుండా జాప్యం చేశారని ఆమె మండిపడ్డారు. అసలేం జరిగిందంటే?
నటి హర్షిక పులకేశినగర్లో మసీదు రోడ్డులోని ఒక రెస్టారెంటులో గురువారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లాలనుకున్నారు. ఇంటి నుంచి రెస్టారెంట్‌కు బయలు దేరిన కాసేపటికే కొందరు దుండగులు తమ వాహనాన్ని అడ్డగించి దాడికి తెగబడ్డారని హర్షిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే పోలీసులు తక్షణమే స్పందించలేదని ఆమె ఆక్రోశించారు.