హీరో దర్శన్ కేసు అప్డేట్.. పోలీసులు ఎదుట పవిత్రగౌడ కన్నీరుమున్నీరు

-

కన్నడ హీరో దర్శన్​ ఓ హత్య కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే తన ప్రేయసి పవిత్ర గౌడకు రేణుకా స్వామి అనే వ్యక్తి అశ్లీల చిత్రాలు, అసభ్యకర సందేశాలు పంపుతూ దర్శన్​ను వదిలేయకపోతే చంపేస్తానని బెదిరించడంతోనే దర్శన్ అతడి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రథమ నిందితురాలైన పవిత్ర విచారణ సందర్భంలో పోలీసుల వద్ద కన్నీరుమున్నీరైంది. రేణుకాస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు- కథానాయకుడు దర్శన్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె విచారం వ్యక్తం చేసింది.

తాను పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని అధికారుల ముందు ఆమె రోదించింది. స్వామి హత్య కేసుకు సంబంధించి బుధవారం నాటి విచారణలో ధీమాగా ఉన్న ఆమె, గురువారం విచారణ సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైందని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే తలా రూ.5 లక్షలు తీసుకున్న కొందరి నుంచి నగదు జప్తు చేసేందుకు అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version