మహిళల ఉచిత బస్సు పథకం రద్దు పై క్లారిటీ ఇచ్చిన కర్ణాటక సీఎం

-

కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకాన్ని పున:సమీక్షించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ పథకం పై చర్చ జరగవచ్చని డిప్యూటీ సీఎం శివకుమార్ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే గురువారం స్వయంగా సీఎం సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొంత మంది మహిళలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యల సమయంలో తాను లేనని చెప్పారు. ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్న మహిళలు తమ ప్రయాణానికి డబ్బు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ.. తనను సంప్రదించారని పేర్కొన్నారు శివకుమార్. దీనిపై మేము కూర్చొని చర్చిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం ఉచిత బస్సు పై మాట్లాడిన వ్యాఖ్యలను కొందరూ ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సీఎం క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version