భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా కొత్త వేరియంట్ జేఎన్1 వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 109 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కన్నడ నాట కొవిడ్ పాజిటివ్ రోగులకు ఏడు రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారం ఒక్కరోజులోనే 74 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కరోనాపై సమావేశమైన కర్ణాటక కేబినెట్ సబ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. కరోనా లక్షణాలు ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపించరాదని పేర్కొంది. కొవిడ్ కేసుల పెరుగుదల, జేఎన్1 వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం, ఏడు రోజుల హోమ్ ఐసోలేషన్ వంటివి పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.