కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పలు వాగ్దాలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే శక్తి యోజన పథకం కింద ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఉచిత బస్సు ప్రయాణం కోసం కక్కుర్తి పడ్డాడు.
ఓ వ్యక్తి.. ముస్లిం మహిళలు ధరించే బుర్కాను వేసుకుని బస్సులో ప్రయాణించాడు. బుర్కాతో ఉన్న ఆ వ్యక్తిని ధార్వాడ్ జిల్లాలో గుర్తించారు. బస్సులో ప్రయాణిస్తున్న అతన్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని వీరభద్రయ్యగా గుర్తించారు. బస్సు స్టాప్‌లో ఒంటరిగా ఉన్న అతనిపై అనుమానం రావడంతో స్థానికులు అతన్ని నిలదీశారు. యాచన కోసమే బుర్కా ధరించినట్లు అతను చెప్పాడు. కానీ అతను ఇచ్చిన వివరణతో అక్కడవాళ్లు సంతృప్తి పడలేదు. శక్తి యోజన కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం అతను బుర్కా వేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అతని వద్ద ఓ మహిళకు చెందిన ఆధార్ కార్డు కూడా ఉండటం గమనార్హం.