ప్రైవేట్‌ సంస్థల్లో కన్నడిగులకే 100% రిజర్వేషన్ : కర్ణాటక సర్కార్

-

రిజర్వేషన్లపై కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్‌-సీ, గ్రూప్-డీ పోస్టులను 100 శాతం కన్నడ వాసులతోనే భర్తీ చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

“రాష్ట్రంలో నెలకొల్పిన అన్ని ప్రైవేట్‌ సంస్థల్లో గ్రూప్-సీ, గ్రూప్-డీ పోస్టులకు సంబంధించి 100% కన్నడిగుల నియమకాన్ని తప్పనిసరి చేసే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.” అని సిద్దరామయ్య పోస్టులో పేర్కొన్నారు. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని వెల్లడించారు. ఈ బిల్లును ఇవాళ (జులై 18వ తేదీ) శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు కర్ణాటక న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. ఏదైనా పరిశ్రమ లేదా సంస్థ మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో 50 శాతం, నాన్‌-మేనేజ్‌మెంట్ కేటగిరీలో 70 శాతం మందిని కేవలం స్థానికుల నుంచే నియమించుకోవాలని బిల్లులో పొందుపరిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version