కౌన్ బనేగా క్రోర్‌పతి : రూ.7 కోట్ల విలువైన ప్రశ్న.. కరెక్ట్‌ చెప్పాడు కానీ కోటి మాత్రమే గెలిచాడు..!

-

కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ) 15వ సీజన్‌ మరో కంటెస్టెంట్ రూ.7 కోట్లకు చేరువగా వచ్చారు. అయితే చివరి ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి వైదొలగి రూ. కోటితో సరిపెట్టుకున్నారు. ఈ సీజన్‌లో గతంలోనూ జస్కరన్ సింగ్ అనే వ్యక్తి రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. గురువారం (సెప్టెంబర్ 21) టెలికాస్ట్ అయిన కేబీసీ ఎపిసోడ్‌లో జస్నిల్ కుమార్ అనే కంటెస్టెంట్ కూడా రూ.7 కోట్లను గెలుచుకోవడానికి చేరువయ్యాడు. అతడు 16వ ప్రశ్నకు సమాధానం చెబితే ఆ భారీ మొత్తం అతని సొంతమవుతుంది. కానీ దానికి సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అవుతానంటూ రూ.కోటితోనే సరిపెట్టుకున్నాడు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా..? దానికి మీకు సమాధానం తెలుసేమో..!!

కౌన్ బనేగా క్రోర్‌పతి
కౌన్ బనేగా క్రోర్‌పతి

భారత సంతతికి చెందిన మహిళా రేస్ ఇంజినీర్ లీనా గడె.. ఈ కింది రేసుల్లో దేనిని గెలిచారు అన్నది ప్రశ్న. దీనికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఎ. ఇండియానాపొలిస్ 500, బి. 24 హవర్స్ ఆఫ్ లె మాన్స్, సి. 12 హవర్స్ ఆఫ్ సెబ్రింగ్, డి. మొనాకో గ్రాండ్ ప్రి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం జస్నిల్ కుమార్ చెప్పలేకపోయాడు.

అయితే గేమ్ క్విట్ అయిన తర్వాత ఏదో ఒక అంచనా వేయమని షో హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడగగా.. అతడు ఆప్ష్ బి. 24 హవర్స్ ఆఫ్ లె మాన్స్ అనే సమాధానమిచ్చాడు. నిజానికి అదే సరైన సమాధానం. అబ్బ ఇది ఇంకా..ఘోరం కదా..! చెప్పినా పోయేది అన్న ఒక డిస్‌శాటిఫాక్షన్‌ అతని ఇక ఎప్పటికీ ఉంటుంది. అలాగే ఆడి ఉంటే రూ.7 కోట్లు వచ్చేవిగా అని ఈ సందర్భంగా అమితాబ్ అతనితో అన్నాడు. అయినా రూ.కోటి గెలుచుకొని అతడు సంతోషంగా ఇంటికెళ్లిపోయాడు.

జనరల్‌ నాలెడ్జ్‌కి బెస్ట్‌ షో ఇది. 2000వ సంవత్సరం నుంచి ఈ షో ప్రసారమవుతుంది. ప్రస్తుతం 15వ సీజన్‌ నడుస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు ఈ షో టెలికాస్ట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news