జమిలీ ఎన్నికలపై.. రామనాధ్ కోవింద్ నేతృత్వంలో తొలి సమావేశం

-

ఒకే దేశం-ఒకే ఎన్నికల్లో భాగంగానే భారత మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ నేతృత్వంలో ఈ రోజు తొలి సమావేశం జరుగనుంది. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కమిటీ లో సభ్యులు గా ఉన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, లోకసభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి. కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, మాజీ ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, 15 వ ఆర్ధిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్.కె.సింగ్, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ ఆజాద్ ఉన్నారు.

అయితే, కమిటీ నుంచి లోకసభ లో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధురి తప్పుకున్నారు. లోకసభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలైనమున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే సాంకేతికంగా, సాధ్యాసాధ్యాల పై సమాలోచనలు జరిపి, సిఫార్సులు చేయనుంది “కోవింద్ కమిటీ”. 1967 వరకు ఒకేసారి ఎన్నికలు ఉండేవి…1968, 69 లలో కొన్ని అసెంబ్లీ లు రద్దయ్యాయి. ఇక ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడి సర్కార్‌ అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news