భీకర మంచు వర్షంలోనూ.. తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు

-

కేదార్​నాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం 6.20 గంటలకు వేద మంత్రాల నడుమ ప్ర‌ధాన పూజారి జ‌గ‌ద్గురు రావ‌ల్ బీమా శంక‌ర్ లింగ శివాచార్య తెరిచారు. సోమ‌వార‌మే కేదార్‌నాథ్ ఆల‌యానికి ఉత్స‌వ మూర్తిని తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. గ‌త 72 గంట‌ల నుంచి కేదార్‌నాథ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భీక‌రంగా మంచు కురిసింది. అయినా స్వామి దర్శనం కోసం వేల మంది భక్తులు తరలివచ్చారు. ఎముకలు కొరికే చలిలో.. భీకర మంచు వర్షంలో ఉదయం 4 గంటల నుంచి వారంతా స్వామి దర్శనం కోసం వేచిచూస్తున్నారు.

కేదారేశ్వరుని ఆలయాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ అలంకరణకు దాదాపు 20 క్వింటాళ్ల పూలను ఉపయోగించారు. ఆల‌యాన్ని తెరిచిన త‌ర్వాత స్థానికులు డోలు వాయించారు. క‌ళాకారుల బృందం తమ వాద్యాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగేలా మంగళ వాద్యాలు మోగించారు. స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తులు పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం హిమాల‌య ప్రాంతాల్లో హిమ‌పాతం కురుస్తోంది. దీంతో ఛార్‌ధామ్ యాత్ర‌కు చెందిన రిజిస్ట్రేష‌న్ల‌ను నిలిపేశారు. కేదార్‌నాథ్ రూట్లో భారీ స్థాయిలో మంచుకురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version