Kejriwal, Manish Sisodia in the lead: ఆధిక్యంలోకి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత బీజేపీ అధికారంలోకి రాబోతుంది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. దాదాపు 27ఏళ్ల తరువాత అధికార పీఠాన్ని దక్కించుకోబోతుంది. ఇప్పటికే అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 సీట్లను దాటి 50 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/aap.jpg)
అధికారం కోసం కమలనాథులు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే… దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మొదట కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వెనుకంజలో పడ్డారు. కానీ ఇప్పుడు తమ తమ నియోజక వర్గాల్లో … ఆధిక్యంలోకి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వచ్చారు. న్యూ ఢిల్లీ లో 254 ఓట్ల ఆధిక్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. జంగ్ పూరా లో 1,8000 ఓట్ల లీడ్ లోకి వచ్చిన మనీష్ సిసోడియా..దూసుకెళుతున్నారు.