కేరళలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. నిఫా వైరస్ ఇప్పుడు కేరళను భయాందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల వ్యవధిలోని ఈ వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆరు జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించారు. నిఫా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పాలక్కడ్, మలప్పురం జిల్లాలలోని ప్రజలు అవసరమైతేనే ఆసపత్రులకు వెళ్లాలని మినిస్టర్ జార్జ్ సూచనలు జారీ చేశారు.

ఇప్పటివరకు 546 మంది కాంటాక్ట్ లను గుర్తించామని చెప్పారు. 46 అనుమానిత కేసులు ఉన్నట్టుగా స్పష్టం చేశారు. దీంతో కేరళలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచనలు జారీ చేశారు. నిఫా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచనలు జారీ చేశారు.