EMI కట్టలేదని జనసేన ఎమ్మెల్యే భత్తుల రామకృష్ణ కారును ఫైనాన్స్ వ్యాపారులు తీసుకెళ్లారు. ఒకప్పుడు భత్తుల రామకృష్ణ ఎంతో గొప్పగా బతికారు కానీ ఇప్పుడు పేదరికంలో మగ్గుతున్నారు. రాజకీయాల కారణంగా తాను అప్పుల పాలయ్యానని రామకృష్ణ అన్నారు. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన మా కుటుంబం ఇప్పుడు చాలా పేదరికంలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కారు EMI కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు వచ్చి నా కారుని తీసుకెళ్లారు.

ఇప్పుడు నా దగ్గర ఎలాంటి కారు లేదు ప్రస్తుతం నా అల్లుడు కారును నేను వాడుతున్నాను. నేను ఎంత పేదరికంలో కష్టాలు అనుభవించినా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు ఎప్పటికీ అన్యాయం చేయను న్యాయం చేస్తాను అంటూ ఎమ్మెల్యే భత్తుల రామకృష్ణ అన్నారు. ప్రస్తుతం రామకృష్ణ షేర్ చేసుకున్న ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజన్లు ఫైనాన్స్ వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.