ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరుగనుంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరుగనుంది.

తాజా భద్రతా పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ భద్రతను బలోపేతం చేయడం, సైనిక దళాల సన్నద్ధతపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర ముఖ్య ప్రభుత్వ రంగ అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.
ఇక అటు మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల సిందూరం తుడిచిన ఉగ్రవాదుల నట్టింట్లోకి వెళ్లి చంపేశాం అంటూ సంచలన కామెంట్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఫైటర్ జెట్ పైలట్స్ ను కలిసారు మోడీ. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న జవాన్లతో ప్రధాని ముచ్చటింఛారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడారు.