ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లగక్కాడు. మళ్లీ హద్దు మీరి హెచ్చరికలు చేశాడు. ఇటీవలే ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను హత్య చేస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి అదే వార్నింగ్ ఇచ్చి మళ్లీ హద్దు మీరాడు. అయోధ్యలో రామాలయంలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించిన పన్నూ ఆడియో బయటకు ఒకటి వచ్చింది.
ఉత్తర్ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు చేసినట్లు ఆడియోలో పేర్కొన్నాడు. భద్రతా ఏజెన్సీలు అనవసరంగా ఆ ముగ్గురినీ వేధింపులకు గురి చేయవద్దని కోరాడు. యూకేకు చెందిన ఓ నెంబర్ నుంచి పన్నూ రికార్డింగ్ మెసేజ్ వచ్చినట్లు సమాచారం. ఈ ఆడియోలో జనవరి 22వ తేదీ అయోధ్యలో జరగనున్న కార్యక్రమాన్ని ఎస్ఎఫ్జే నుంచి ఎవరూ కాపాడలేరని పన్నూ హెచ్చరించాడు. ఈ ఆడియో నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.