కాంగ్రెస్‌ హామీలను నమ్మొద్దు.. తెలంగాణ ప్రజలకు హెచ్ డీ కుమారస్వామి సూచన

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల జాతీయ నేతలు రంగంలోకి దిగి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ నేత మాత్రం తెలంగాణ ప్రజలకు ఓ సూచన చేశారు. అదేంటంటే..

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని జేడీఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సూచించారు. ఆ పార్టీ తమ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను గంగలో పడేసిందని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు వారి హామీలను నమ్మి ఓటు వేసి మోసపోవద్దని అన్నారు. ఆ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని కుమారస్వామి ధ్వజమెత్తారు. కర్ణాటక పథకాలు తెలంగాణలో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు.. కన్నడనాట మాట నిలబెట్టుకోలేక పోతున్నారు.. ఇక తెలంగాణలో ఎలా చేస్తారంటూ కుమారస్వామి ప్రశ్నించారు. కన్నడనాట కాంగ్రెస్‌ ఇచ్చిన 5 గ్యారెంటీలూ విఫలమయ్యాయని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news