కరోనాతో ఆ రాష్ట్రాల‌కు మరింత ముప్పు..!

-

క‌రోనా విల‌యం ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. గ‌త ఎనిమిది నెల‌లుగా ప్ర‌జ‌ల‌ను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కొవిడ్ -19 వైర‌స్‌.. రానున్న రోజుల్లో మ‌రింత‌గా విజృంభించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. ఇందుకు ఉద‌హ‌ర‌ణ‌గా ప్రస్తుతం దేశంలోని కేరళ, పంజాబ్, ఢిల్లీల‌ను చూపుతున్నారు. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. దీనిని కరోనా సెకెండ్ వేవ్‌కు సంకేతంగా శాస్త్రవేత్తలు పేర్కొంటుండటం గ‌మ‌నార్హం.

రాబోయే పండుగల సందర్బంగా కరోనా ముప్పు మరింతగా పెర‌గ‌వ‌చ్చని కూడా శాస్త్ర‌వేత్త‌లు హెచ్చరిస్తు న్నారు. సెప్టెంబరు 9న ఢిల్లీలో అత్యధికంగా ఒక్కరోజులో 4,039 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాల ప్రకారం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2.5 లక్షలను దాటింది. కొత్తగా మరో 3,827 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కేరళలో కూడా కొత్తగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటివారంలో కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే సెప్టెంబర్ చివరినాటికి కొత్తగా రాష్ట్రంలో 5,898 కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశంగా మారింది. ఇక పంజాబ్‌లోని లుథియానా, జలంధర్, మోహాలీ, అమృత్‌సర్. పటియాలా ప్రాంతాలలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీనినే కరోనా సెకెండ్ వేవ్‌కు సంకేతంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version