Lionel Messi : అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీకి బాలన్‌ డీ ఓర్‌ అవార్డ్‌..

-

Lionel Messi : ఫుట్‌ బాల్‌ దిగ్గజం లియోనల్ మెస్సి అరుదైన అవార్డు అందుకున్నారు. లియోనల్ మెస్సికి మరోసారి బాలన్ డి ఓర్ అవార్డు దక్కింది. 2022-23 గాను ఉత్తమ ప్రదర్శన కనబడచడంతో పాటు ఖతర్ వేదికగా జరిగిన ఫుట్బాల్ ప్రపంచకప్ లో తన జట్టును గెలిపించిన మెస్సినే ఈ అవార్డును అందుకున్నాడు.

Lionel Messi beats Haaland, clinches record-extending eighth Ballon d’Or award

అత్యధిక సార్లు(8) ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగాను మెస్సి రికార్డు సృష్టించారు. పారిస్ వేదికగా ఈ అవార్డు ప్రధాన ఉత్సవం జరిగింది. అత్యధిక బాలన్ డి ఓర్ అవార్డు పొందిన వారిలో క్రిస్టియానో రోనాల్డో(5) రెండో స్థానంలో ఉన్నాడు. మహిళల భాగంలో స్పెయిన్, మార్సిలోన జట్టు మిడ్ ఫీల్డర్ ఐతన బోన్ మాటి తొలిసారిగా బాలన్ డి ఓర్ అవార్డును అందుకుంది. ఈమె 2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టులో సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news