మందుబాబులకు గుడ్ న్యూస్.. త్వరలో జొమాటో స్విగ్గీల్లో మద్యం డెలివరీ

-

మందుబాబులకు గుడ్ న్యూస్. ఇక నుంచి వైన్ షాపుల వద్ద గంటలు గంటలు క్యూ కట్టకుండా హాయిగా ఇంటి వద్దకే మద్యం తీసుకువచ్చే సౌలభ్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. అదేంటని అనుకుంటున్నారా..?  ఫుడ్‌ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ , బిగ్‌ బాస్కెట్‌  వంటి యాప్‌లు త్వరలో బీర్‌, వైన్‌, లిక్కర్‌ వంటి తక్కువ ఆల్కహాల్‌ డ్రింక్స్‌ను హోం డెలివరీ చేయనున్నాయట. దీనివల్ల వచ్చే లాభనష్టాలు అంచనా వేసి అమల్లోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

దిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో దీనిని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతి ఉంది. దీనిద్వారా ఆన్‌లైన్ డెలివరీల అమ్మకాలు 20-30శాతం పెరిగాయని రిటైల్ పరిశ్రమ అధికారులు తెలిపారు.

మహానగరాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం, మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారికోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నామని ఎగ్జిక్యూటివ్‌ అధికారి పేర్కొన్నారు. దీనికి వయసు ధ్రువీకరణ, ఆన్‌లైన్‌ మోడ్‌ లావాదేవీలు, టైమింగ్స్‌ వంటి నియమాలు ఉంటాయని స్విగ్గీ ఉన్నతాధికారి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news