విడాకులు తీసుకోకుండా వేరొకరితో ఉండటం సహజీవనం కాదు : హైకోర్టు

-

విడాకులు ఇవ్వకుండా వేరొకరితో కలిసి ఉండడాన్ని సహజీవనంగా కానీ, వైవాహిక బంధం లాంటి సంబంధంగా కానీ పరిగణించరాదని పంజాబ్‌, హర్యాణా హైకోర్టు స్పష్టం చేసింది. వివాహేతర సంబంధంలో ఉన్న ఒక జంట తమ స్వేచ్ఛకు రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టడానికి నిరాకరించింది.. బంధువుల నుంచి ప్రాణాపాయం ఉందని పిటిషనర్లు చేసిన ఫిర్యాదుకు బలమైన ఆధారాలు లేవని చెబుతూ ఈ పిటిషన్​ను జస్టిస్‌ కులదీప్‌ తివారీ తోసిపుచ్చారు.

పిటిషనర్లలో మహిళ అవివాహిత కాగా, పురుషుడికి ఇది వరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండగా.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఆ వ్యక్తి ఈ మహిళతో సంబంధం కొనసాగించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీసీ 494, 495 సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరాలుగా పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. శిక్షపడే ప్రమాదాన్ని తప్పించుకోవడానికే పిటిషనర్లు సహజీవనం అంటూ కోర్టు సమ్మతి పొందడానికి ఎత్తుగడ వేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వారు కామపూరిత, వ్యభిచార జీవితం గడుపుతున్నట్లేనని వ్యాఖ్యానిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version