ఒక్క అవకాశం ఇవ్వండి..మీ బతుకులను మారుస్తా – నీలం మధు

-

ఒక్క అవకాశం ఇవ్వండి..మీ బతుకులను మారుస్తానని పటాన్చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొల్లారం మున్సిపాలిటీ లోని ప్రతి వాడవాడ తిరుగుతూ ప్రజలకు బహుజన రాజ్యాధికారంతో పాటు బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో ను వివరించారు.నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ సబండవర్గాల ఏజెండా గా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.

neelam madhu

మన బిడ్డలు చట్ట సభల్లో ఉంటేనే మన వర్గాలకు సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మన జాతులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయలకే పరిమితం చేస్తూ బానిసలుగా చూస్తున్న బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.పేరుకు బొల్లారం మున్సిపాలిటీ గా పదోన్నతి చెందిన అభివృద్ధిలో మాత్రం అధోగతి గా ఉందని విమర్శించారు. కాలనీలో ఎక్కడ చూసినా గతుకుల రోడ్లు మురికి కాలువలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు.మన ఓట్లు మనమే వేసుకొని మనల్ని మనం గెలిపించుకుంటే మన వాడల్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు.నన్ను గెలిపించిన క్షణం నుంచే పక్క ప్రణాళికతో బొల్లారం మున్సిపాలిటీ ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు.ముఖ్యంగా ఇండ్లు లేని నిరుపేదలకు పక్క ఇండ్లు కట్టించే దిశగా అడుగులు వేస్తానన్నారు.బొల్లారం పారిశ్రామిక వాడలో పని చేస్తున్న కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక పాలసీని రూపొందిస్తామని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version