మూడోదశ ఓటింగ్.. ఉదయం 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా

-

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ఈరోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలంతా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంల్లోని 93 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అహ్మదాబాద్లోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బెలగావి బీజేపీ అభ్యర్థి జగదీశ్ శెట్టర్ తన కుటుంబంతో సహా ఓటేశారు.

ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్‌ శాతం ఇలా

అసోం 27.34

బిహార్‌ 24.41

ఛత్తీస్‌గఢ్‌ 29.90

డామన్‌డయ్యు 24.69

గోవా 30.94

గుజరాత్‌ 24.35

కర్ణాటక 24.48

మధ్యప్రదేశ్‌ 30.21

మహారాష్ట్ర 18.18

ఉత్తర్‌ప్రదేశ్‌ 26.12

బంగాల్‌ 32.82

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన భార్య రధాభాయి ఖర్గేతో కలిసి కర్ణాటకలోని కళబురగిలో ఓటు వేశారు. కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ హవేరి లోక్సభ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో బారామతి ఎన్సీపీ(శరద్) అభ్యర్థి సుప్రియా సూలే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news