సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన కీలక దస్త్రాలు!

-

మధ్యపద్రేశ్‌ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ‘వల్లభ్‌ భవన్‌’లో ఇవాళ ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. ఈ బహుళ అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగి భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఇది గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని 20 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. మూడో అంతస్తులో భద్రపర్చిన కొన్ని కీలక డాక్యుమెంట్లు కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. రాష్ట్ర సచివాలయ భవనంలో మూడో అంతస్తులో మంటలు చెలరేగాయని తెలిపారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎస్ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version