రానా, తమన్నా సహా పలువురికి షాకిచ్చిన హైకోర్టు

ఆన్లైన్ గ్యాంబ్లింగ్ విషయంలో పలువురు సెలబ్రిటీల కి షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. గ్యాంబ్లింగ్ కి అనుకూల ప్రకటనలో నటించిన పలువురు సెలబ్రిటీలకు ఈరోజు నోటీసులు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మరో క్రికెటర్ గంగూలి, సినీ నటి తమన్నా, సినీ నటులు ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, కన్నడ స్టార్ హీరో సుదీప్ లకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని దాఖలైన పిల్ ఆధారంగా విచారణ చేపట్టిన హైకోర్టు. అభిమానుల మీద ప్రభావం చూపిస్తాయని తెలిసినా ఇలాంటి యాడ్స్ లో ఎందుకు నటిస్తున్నారని వారిని ప్రశ్నించింది. అలానే ఎందుకు నటిస్తున్నారో తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అంతే కాదు ఈ నెల 19 లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు నోటీసులు అందుకున్న వారిని ఆదేశించింది.