త్వరలోనే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌..?

-

మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నేతల తిరుగుబాటుతో ఆ రాష్ట్ర రాజకీయాలు దేశంలో సంచలనం రేతెక్కించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మహా రాజకీయాల్లో ప్రకంపనలు చోటుచేసుకుబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతోంది తాజాగా ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ చేసిన ట్వీట్. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే..

ఈ ట్వీట్ మోత్కాల్.. అజిత్‌ పవార్‌ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దతుదారుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన వీడియో ఉంది. కొన్ని హోర్డింగ్‌ల్లో అజిత్ పవార్‌ను మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు.  ‘నేను అజిత్‌ అనంతరావు పవార్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణం చేబోతున్నాను’ అంటూ వీడియోను జత చేస్తూ ట్వీట్‌ చేశారు.

మహారాష్ట్రలో శివసేన (షిండేవర్గం), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత.. ఎన్నికల్లో సంకీర్ణ కూటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో శివసేన ఓటు బ్యాంకును షిండే తన వైపు తిప్పుకోలేకపోతున్నారని బీజేపీ భావిస్తుంది. ఈ పరిస్థితుల్లో మహా వికా అఘాదీని ఎదుర్కొనేందుకు అజిత్‌ పవారే సరైన వ్యక్తని భావిస్తోంది. ఈ క్రమంలోనే పవార్‌ బీజేపీతో కలిసి ప్రభుత్వంలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version