ఆకలి బాధతో పిల్లి మాంసాన్ని పీక్కుతిన్నాడు.. ఎక్కడంటే?

-

కేరళలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా తిండిలేక ఆకలితో బాధపడుతున్న ఓ యువకుడు తన కడుపు మంట తీర్చుకోవడానికి చనిపోయిన పిల్లిని పీక్కుతిన్నాడు. మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండులో ఈ హృదయ విదారక దృశ్యం కనిపించడంతో స్థానికులు చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని ఆ యువకుడికి ఆహారం అందించారు. అనంతరం అతడి వివరాలు ఆరా తీశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అస్సాంలోని ధుబరీ జిల్లాకు చెందిన ఆ 27 ఏళ్ల యువకుడు అక్కడే ఓ కళాశాలలో చదువుతుండేవాడని పోలీసులు తెలిపారు. గత డిసెంబరులో ఇంట్లోవారికి చెప్పకుండా రైల్లో కేరళకు వచ్చాడని డబ్బు లేకపోవడంతో అయిదురోజులుగా భోజనం చేయలేదని వెల్లడించారు. ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయిన ఓ పిల్లి కనిపించడంతో, దాని మాంసాన్ని పచ్చిగానే తింటూ స్థానికులకు కనిపించాడని చెప్పారు.  అతడి కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించి సమాచారం అందించి ఆ యువకుణ్ని ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version