ఛత్తీస్‌గఢ్-దంతేవాడ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిని గొంతు కోసి హత్య చేసిన మావోయిస్టులు..తమ పగ తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్-దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సేను అతి కిరతకంగా హత్య చేశారు మావోయిస్టులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/mavoi.jpg)
గురువారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల ఎదుటే గొంతు కోసి హత్య చేశారు మావోయిస్టులు. గతంలో సీపీఐలో ఉండగా.. కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న జోగా… మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. మావోయిస్టుల సమాచారం, రహస్యాలను లీక్ చేసిన తరుణంలోనే… పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సేను అతి కిరతకంగా హత్య చేశారు మావోయిస్టులు.