విపక్ష నేతలు సైలెంట్‌గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడీ వస్తుందంటూ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పార్లమెంట్ సాక్షిగా హెచ్చరించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై లోక్ సభలో చర్చ జరిగిన సమయంలో మీనాక్షి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’పై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ‘‘నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ అధికారులు రావాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అనంతరం ఈ బిల్లును సమర్థిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా లేఖి ఘాటు విమర్శలు చేశారు. ఆయన ‘పావు వంతు సీఎం’ అని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ये चेतावनी ⚠️ है या धमकी ⛔? pic.twitter.com/YjHx5d2uR8
— Srinivas BV (@srinivasiyc) August 3, 2023