దేశ వ్యాప్తంగా రైతుల ఆగ్రహానికి కారణమైన సాగు చట్టాలను తిరిగి తీసుకురావడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్ లో క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ లో సాగు చట్టాలను మళ్లీ తీసుకువస్తారా.. అని ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి తోమర్ క్లారిటీ ఇచ్చారు. రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అలాగే సాగు చట్టాలను వ్యతిరేకిస్తు రైతులు చేసిన ఉద్యమంలో.. రైతుల మృతికి సంబంధించి నష్ట పరిహారం గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినది అని అన్నారు.
కాగ గతంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తామని ఒక సమావేశంలో అన్నారు. ఆ వీడియో వైరల్ కావడంతో దానిపై అప్పట్లోనే వివరణ ఇచ్చారు. కాగ మరోసారి రాజ్య సభలో సాగు చట్టాలపై కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. అలాగే పీఎం కిసాన్ పంపిణీ గురించి కూడా రాజ్య సభలో మంత్రి తోమర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8 నాటికి 11.78 కోట్ల లబ్ధిదారులకు రూ. 1.82 లక్షల కోట్లను అందించామని ప్రకటించారు.