ఎన్నికల ఫలితాల ఆగ్రహం పార్లమెంటు సమావేశాలపై ప్రభావం చూపకూడదు: మోదీ

-

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ఎప్పటిలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందేశమిచ్చారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో పేదలకు అందించిన వారికే ప్రజలు పట్టం కట్టారని మోదీ అన్నారు. సుపరిపాలన, జన హితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. కొత్త పార్లమెంటులో సుదీర్ఘ కాలం కార్యకలాపాలు జరుగుతాయని వెల్లడించారు. కొత్త పార్లమెంటు వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చని.. వాటిపై సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేస్తామని తెలిపారు.

“భారత్‌ మరింత పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విపక్షాలను కలుపుకొని పోతాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కేంద్రంగా పార్లమెంటు విలసిల్లాలి. వికసిత భారత్‌ మరింత పురోభివృద్ధికి పాటుపడాలి. పార్లమెంటులో బిల్లులపై జరిగే చర్చల్లో విపక్షాలు పాల్గొనాలి. చర్చలు సజావుగా సాగకపోతే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేరు. ఎన్నికల ఫలితాల కోపం చర్చలపై ప్రభావం చూపకూడదు. పరాజయాన్ని స్వీకరించి సభ్యులు హుందాగా ప్రవర్తించాలి. అప్పుడే సభ్యులను దేశం చూసే దృష్టి కోణం మారుతుంది.” అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news