మూడోసారీ మోదీయే పీఎం.. అయోధ్య రామమందిర్ అంశం కలిసొస్తుంది : ద గార్డియన్‌

-

భారత్లో ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లోనూ బీజేపీయే ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే భారత్కు మూడోసారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే నాయకత్వం వహిస్తారని తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ద గార్డియన్‌ పేర్కొంది. రామమందిరం అంశం ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో మోదీకి కలిసొస్తుందని అంచనా వేసింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల మాదిరిగా భారీ మెజారిటీని బీజేపీ సాధిస్తుందా లేదా అని చెప్పలేమని తెలిపింది. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఓటింగ్‌ శాతాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది.

ఇప్పటికే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీకి ఉన్న అపారమైన ప్రజాదరణ ఆయణ్ను మరోసారి ప్రధాని పీఠం ఎక్కిస్తాయని ద గార్డియన్ తెలిపింది. భారత రాజకీయ విశ్లేషకులంతా ఇదే నమ్ముతున్నారని తన కథనంలో పేర్కొంది. బీజేపీ హిందూ జాతీయవాద ఎజెండా దేశంలోని హిందూ వర్గాన్ని, ముఖ్యంగా ఉత్తర భారత ప్రజలను ఆకర్షిస్తూనే ఉందని వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో కమలదళానికి ప్రాంతీయ వ్యతిరేకత బలంగా ఉన్నా కేంద్ర స్థాయిలో విపక్షాలు బలహీనంగా ఉన్నాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version