బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: జిన్‌పింగ్‌

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బైడెన్తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంతే కాకుండా చైనా, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి, ప్రపంచశాంతి, అభివృద్ధి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 45 ఏళ్లు కావొస్తున్న తరుణంలో జిన్‌పింగ్‌ ఈ సందేశం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సంబంధాలు స్థిరంగా అభివృద్ధి చెందేందుకు ఇరు వైపులా చర్యలు తీసుకోవాలని జిన్పింగ్ ఈ సందర్భంగా బైడెన్ను కోరారు. పలు అంశాల్లో రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో గతేడాది నవంబర్‌లో జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో బైడెన్తో భేటీ అయిన జిన్పింగ్ వాణిజ్యం, భౌగోళిక, రాజకీయ అంశాలపై చర్చించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌కు కూడా జిన్‌పింగ్ కొత్త సంవత్సరం సందేశం పంపారు. 2024ను ఫ్రెండ్‌షిప్‌ ఇయర్‌గా కిమ్‌, జిన్‌పింగ్‌లు అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version