బంగ్లాదేశ్ క్రికెటర్ మహమ్మద్ నయీమ్ నిప్పులపై నడిచిన వీడియో వైరల్ అవుతుంది. ఆసియా కప్ 2023కి సిద్ధమవుతున్న నయీమ్ మైండ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రైనర్ చెప్పినట్లు నయీమ్ నిప్పులపై నడిచారు. ఫైర్ వాకింగ్ ద్వారా క్రీడాకారులు తమ ధైర్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు భయాన్ని అదుపులో ఉంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఈ ఆసియా కప్ లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ మరియు నేపాల్ జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ ఆసియా కప్ ను పాకిస్తాన్ మరియు శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి.
మొదటగా గ్రూప్ స్టేజ్ లో ప్రతి జట్టు రెండు మ్యాచ్ లను ఆడుతుంది. ఇందులో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు మాత్రమే సూపర్ 4 కు అర్హత సాధిస్తాయి. చివరి రెండు స్థానాలలో నిలిచిన రెండు జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తాయి. కాగా ఈ టోర్నీ లో మొదటి మ్యాచ్ నేపాల్ మరియు పాకిస్తాన్ లకు మధ్యన ముల్తాన్ లో జరుగుతుంది.
bangladesh cricketer mohammad nayeem walking on fire pic.twitter.com/NOGpJAvrxP
— Sayyad Nag Pasha (@nag_pasha) August 19, 2023