లోకేష్ కి విజయవాడలో అడుగుపెట్టే అర్హత లేదు – వెల్లంపల్లి

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు విజయవాడలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కి విజయవాడలో అడుగుపెట్టే అర్హత లేదని అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు, మంత్రిగా లోకేష్ విజయవాడకు ఏం చేశారని ప్రశ్నించారు. లోకేష్ ని తాము అడ్డుకుంటే ఇన్ని రోజులు పాదయాత్ర చేసి ఉండేవాడా..? అని ప్రశ్నించారు. అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

కృష్ణ వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల కోసం చంద్రబాబు రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేకపోయాడని ప్రశ్నించారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తి చేసింది ఎవరు..? అని నిలదీశారు. విజయవాడ ఫ్లై ఓవర్ ను ప్రారంభించి పూర్తి చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు వెల్లంపల్లి. సీఎం జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. జగన్ పాలనలో స్వచ్ఛ సురక్షలో విజయవాడ నగరానికి మూడవ ర్యాంకు వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news