అయోధ్య బాలరాముడి మందిరంలో భక్తుల సందర్శన కొనసాగుతోంది. రామ్ లల్లాను దర్శించుకునేందుకు ఇవాళ కూడా పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీరామజన్మ మందిర ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే తాజాగా అయోధ్య బాలక్ రామ్ మందిరంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం రోజున సాయంత్రం హనుమంతుడు రాముడి దర్శనానికి స్వయంగా వచ్చారట. ఇంతకీ ఏం జరిగిందంటే..?
“రామమందిరంలో మంగళవారం సాయంత్రం ఓ వానరం ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆలయ దక్షిణ ద్వారం నుంచి ఓ వానరం రామాలయ గర్భగుడిలోకి ప్రవేశించింది. అది చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వానరం రామయ్య ఉత్సవ విగ్రహాన్ని నేలపై తోసేస్తుందన్న భయంతో భద్రతా సిబ్బంది వెంటనే పరుగెత్తుకెళ్లి కోతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు కోతి ఆలయ ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. ఆ గేటు మూసి ఉండడం వల్ల తూర్పు ద్వారం గుండా వేలాది భక్తులను దాటుకుని ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా బయటకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన భద్రతాసిబ్బంది స్వయంగా హనుమంతుడే రామయ్య దర్శనం చేసుకోవడానికి వచ్చినట్లుగా అనిపించిందని అంటున్నారు.” అని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఎక్స్లో పోస్టు చేసింది.
आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन:
आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के
पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव…— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024