మైసూరు “పాక్” పేరును మైసూరు “శ్రీ” గా స్వీట్ షాపు యజమాని మార్చేశాడు. పహల్గం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ దేశంపై భారతీయులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో మైసూర్ పాక్ పేరు మార్చాలని సోషల్ మీడియాలో మీమ్స్ చేశారు నెటిజన్లు.

ఈ తరుణంలోనే రాజస్థాన్ జైపూర్ లో గల ప్రముఖ “త్యోహర్ స్వీట్స్” యజమానికి ఈ డిమాండ్ బాగా నచ్చి, తన షాపులో మైసూరు పాక్ పేరును మైసూరు శ్రీ గా మార్చేశాడు. అతని షాపులో విక్రయించే మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ స్వీట్ పేర్లను సైతం మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ గా పేర్లు మార్చేశాడు యజమాని. దేశభక్తి కేవలం సరిహద్దులోనే కాదు ప్రతీ పొరుడిలో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించిన షాపు యజమాని… మైసూరు “పాక్” పేరును మైసూరు “శ్రీ” గా స్వీట్ షాపు యజమాని మార్చేశాడు.