నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు

-

భారతదేశంలో బ్రిటీష్‌ కాలంనాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలకు ఇవాళ్టితో కాలం చెల్లింది. వాటి స్థానంలో ఈరోజు (జులై 1వ తేదీ 2024) నుంచి భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌, పోలీసు ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయడం, SMS వంటి ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం, హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటివి నూతన చట్టాల్లో పొందుపరిచారు.

కొత్తనేర చట్టాల ప్రకారం క్రిమినల్‌ కేసుల్లో విచారణ పూర్తైన 45రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. తొలివిచారణ జరిగిన 60 రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని వారి గార్డియన్‌ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చాప్టర్ యాడ్ చేసి.. చిన్నారులను అమ్మడం లేదా కొనడం కూడా తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. మైనర్లపై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఐపీసీలో 511సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలోవాటిని 358 సెక్షన్లకు కుదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version