గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనలో తొమ్మిది మంది అరెస్టు

-

గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు మానవ తప్పిదాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. 100 మందిని మాత్రమే మోయగల సామర్థ్యం ఉన్న వంతెనపైకి 400 నుంచి 500 మందిని అనుమతించడం సహా కొందరి ఆకతాయి చేష్టలే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Rescuers on boats search in the Machchu river next to a cable bridge that collapsed in Morbi town of western state Gujarat, India, Monday, Oct. 31, 2022. The century-old cable suspension bridge collapsed into the river Sunday evening, sending hundreds plunging in the water, officials said. (AP Photo/Ajit Solanki)

ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు 130కిపైగా మరణించారని గుజరాత్ పోలీసులు తెలిపారు. మృతుల్లో అధికంగా చిన్నారులు, మహిళలే ఉన్నారని వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో కొంతమంది యువకులు వంతెనపై నిల్చొని బ్రిడ్జిని ఊపుతూ కనిపించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వంతెన కుప్పకూలి అందరూ నదిలో పడిపోయారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేబుల్ బ్రిడ్జి నిర్వహణ సంస్థకు చెందిన కొంతమందిని పోలీసులు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version