దేశంలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ప్రయాణికులకు త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. కర్ణాటక శివమొగ్గ జిల్లా సిగందూర్ సమీపంలోని శరావతి బ్యాక్ వాటర్ పైన రూ. 473 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను నితిన్ గడ్కరి నిన్న ప్రారంభించారు. 2.14 కిలోమీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ బ్రిడ్జి 740 మీటర్ల వెడల్పు ఆధారంగా నిలిచి ఉంది.

కాగా, గుజరాత్ ఒఖా-బేట్ ద్వారకా మధ్య ఉన్న సుదర్శన్ సేతు దేశంలోనే పొడవైన 2.32 కిలోమీటర్ల కేబుల్ బ్రిడ్జి కావడం విశేషం. ఇది దేశంలోనే మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జి కాగా ఇప్పుడు రెండో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.