అబద్దాలను మోసాలను ప్రజలు నమ్మకూడదని.. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి అని పేర్కొన్నారు సీఎం జగన్. ఉమ్మడి జిల్లాలో లక్కసాగరం వద్ద పంపు హౌస్ ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం డోన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు జగన్. హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కి కేవలం వర్షమే దిక్కు. పాదయాత్రలో మాట ఇచ్చాం.. ఇప్పుడు నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు జగన్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి అని ప్రజలకు సూచించారు సీఎం జగన్. చంద్రబాబు ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది దత్త పుత్రుడితో పంచుకోవడం అన్నారు జగన్.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత గాజుల దిన్నె సామర్థ్యాన్ని పెంచుకున్నామని.. గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చామని తెలిపారు సీఎం జగన్. పోతురెడ్డిపాడులో నీరు నిలువ చేయాలంటే శ్రీశైలం నుంచి నీరు విడుదల చేయాల్సి ఉండేది. శ్రీశైలం నుంచి నీరు విడుదల చేయాలంటే ప్రాజెక్టు పూర్తిగా నిండితేనే నీటిని విడుదల చేసేది. గత ప్రభుత్వం ప్రకాశం జిల్లాను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అని ప్రశ్నించారు సీఎం జగన్.