ఖమ్మంలో కారుకు తుమ్మల ఎఫెక్ట్..అవే మైనస్.!

-

ఎన్నికల దగ్గరవుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ కు సొంత పార్టీ నేతలు షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.

మరి తుమ్మల కాంగ్రెస్ లో చేరడం వల్ల..ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం ఉంటుందా? అంటే ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గతంలో తెలుగుదేశం లో ఉన్న కార్యకర్తలు అందరూ తుమ్మల  వైపే ఉన్నారు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. తుమ్మల వల్ల చాలావరకు కమ్మ ఓట్లు గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్‌కు పడ్డాయి. ఇప్పుడు తుమ్మల కాంగ్రెస్ వైపు వెళ్ళడంతో..ఆ ఓట్లు అటు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది బిఆర్ఎస్ కు పెద్ద నష్టం.

 

పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో తుమ్మలకు మంచి పట్టు ఉంది. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు బలం పెరిగే ఛాన్స్ ఉంది. అయితే తుమ్మలకు ఏ సీటు ఇస్తారనేది క్లారిటీ లేదు. ఎలాగో బి‌ఆర్‌ఎస్ లో తుమ్మలకు సీటు దక్కలేదు. అందుకే ఆయన బి‌ఆర్‌ఎస్‌ని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు.

ఖమ్మంలో మూడు సీట్లే జనరల్ సీట్లు. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు సీట్లు. అయితే కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. పాలేరులో తుమ్మలని బరిలో దించుతారా? ఇక్కడ షర్మిలని నిలబెట్టి తుమ్మలని ఖమ్మంకు పంపిస్తారా? అనేది చూడాలి. మొత్తానికైతే తుమ్మల వల్ల ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్‌కు డ్యామేజ్ తప్పదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version