సామాన్యులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ తరాలు విపరీతంగా పెరిగాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ వచ్చిన నేపథ్యంలో… చమురు సంస్థలు గ్యాస్ ధరలను అప్డేట్ చేశాయి. ఈ తరుణంలోనే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పైన ఏకంగా 39 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటన చేశాయి.
పెరిగిన ధరలు సెప్టెంబర్ ఒకటో తేదీ అంటే ఇవాల్టి నుంచి అమలులోకి రాబోతున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1691.50 రూపాయలకు చేరింది. అదే మన హైదరాబాద్ మహానగరంలో… కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1935 రూపాయలుగా నమోదు అయింది. ఇక అదే సమయంలో.. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం…స్థిరంగానే ఉంది. దీంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు.