అయ్యో తల్లి… రూ. 500 కోసం 100 కిలోమీటర్లు నడిచిన వృద్దురాలు…!

-

కరోనా లాక్ డౌన్ లో తినడానికి తిండి లేక ఇబ్బంది పడే పేదలు చాలా మందే ఉన్నారు ప్రభుత్వాలు చేసే సహాయం కోసం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. ఎంతో కొంత వస్తుంది అనుకుని నడక మార్గంలో అయినా సరే డబ్బులు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగే చేసింది ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక వృద్దురాలు. యూపీలోని ఫిరోజాబాద్‌ ప‌రిధిలోని హిమ్మత్‌పూర్ లో 72 ఏళ్ళ రాధ అనే వృద్దురాలు నివాసం ఉంటుంది.

ఆమెకు ఇల్లు గడవడం చాలా కష్టం. ఈ తరుణంలో ప్రభుత్వం జనధన్ ఖాతాలో నగదు జమ చేసింది అని స్థానికంగా ఉండే వాళ్లు చెప్పారు. దీంతో ఆశపడిన రాధ… ఆగ్రాలోని రాంబాగ్‌లో ఉన్న త‌న బ్యాంకు ఖాతా నుండి రూ. 500 తీసుకుందాం అనుకుని దాదాపు 50 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. బ్యాంకు శాఖకు చేరుకోగానే ఆమె ఖాతాను పరిశీలించారు బ్యాంకు అధికారులు.

కాని అందులో ఏ డబ్బులు జమ కాలేదు అని చెప్పడంతో కన్నీరు పెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళింది. మళ్ళీ కాలి నడకనే 50 కిలోమీటర్లు నడిచింది. మొత్తం వంద కిలోమీటర్లు 500 కోసం నడిచి వెళ్ళింది ఆ వృద్దురాలు. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన అక్కడి యువకులు ఆమె ఖాతాలో డబ్బులు లేవనే విషయం తెలుసుకుని ఆమెకు 500 సహాయం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news