Oneindia వెబ్‌ సైట్‌ అరుదైన రికార్డు…ఎలైట్ జాబితాలో స్థానం !

-

Oneindia వెబ్‌ సైట్‌ అరుదైన స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 వెబ్‌సైట్‌ల ఎలైట్ జాబితాలో Oneindia చేరింది. Oneindia వెబ్‌ సైట్‌ నిత్యం ప్రజల క్షేమం, జనాలకు అవసరమైన వార్తలను అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈ తరుణంలోనే.. Oneindia వెబ్‌ సైట్‌ కు ప్రజాధరణ క్రమ క్రమంగా పెరుగుతోంది.

Oneindia Joins Elite List of Top 10 Fastest-Growing Websites Worldwide

ఇక ఈ తరుణంలోనే.. తాజాగా టాప్ 10 వెబ్‌సైట్‌ల ఎలైట్ జాబితాలో Oneindia చేరింది. డిసెంబర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే టాప్ 50 సైట్‌లలో ఒకటిగా Oneindia వెబ్‌ సైట్‌ నిలిచింది. దీనిపై Oneindia వెబ్‌ సైట్‌ యాజమాన్యం హర్యం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల కృషితోనే ఈ స్థాయికి వచ్చామని పేర్కొంది.

ఇక వన్ఇండియా సిఇఒ రావణన్ ఎన్ మాట్లాడుతూ, మా పాఠకులు, మద్దతుదారులకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. డిజిటల్ యుగంలో ఈ విజయం సాధించడం గర్వ కారణంగా ఉందని తెలిపారు. నాణ్యత గల కంటెంట్‌ను అందించడం మా లక్ష్యమన్నారు. ఏ శక్తులకు భయపడబోమని ప్రకటించారు వన్ఇండియా సిఇఒ రావణన్ ఎన్. ఈ విజయంతో మరింత ముందుకు వెళతామని…ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో దూసుకెళతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news