ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం

-

దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సేకరించిన బఫర్‌ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను కేంద్రం బఫర్‌ స్టాక్‌గా గోదాముల్లో భద్రపరిచింది. ఏటా మార్కెట్లోకి సరఫరా తగ్గి, ధరలు పెరిగిన సందర్భాల్లో కేంద్రం ఆ బఫర్‌ స్టాక్‌ను విడుదల చేస్తుంటుంది.

‘దేశంలోని పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లి నిల్వలను పంపించాలని నిర్ణయించాం. ఈ ఏడాదిలోనే అత్యధిక ధరలు నమోదైన, దేశంలోని సగటు ఉల్లి రేటు కంటే ఎక్కువగా ఉన్న, గత నెలతో పోలిస్తే ధరలు పెరిగిన ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తాం. ఈ-వేలం, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్‌ విక్రయ మార్గాల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తామని’ ఆహార మంత్రిత్వశాఖ శుక్రవారం రోజున ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాలు ప్రజా పంపిణీ కోసం కోరితే తగ్గింపు ధరతో వాటిని సరఫరా చేస్తామని అందులో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version