వరదల ఎఫెక్ట్.. హిమాచల్​లో వీడియో కాన్ఫరెన్స్‌ పెళ్లి

-

హిమాచల్ ప్రదేశ్​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలతో ఆ రాష్ట్రం అస్తవ్యస్తమవుతోంది. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వివాహాలు వాయిదా పడుతున్నాయి. కానీ ఓ జంట మాత్రం ముంచెత్తుతున్న వరదల్లోనే వివాహం చేసుకుంది. అయితే ఇది సాధారణ పెళ్లి కాదు. ఆన్​లైన్ వివాహం.

హిమాచల్​ను వరదలు ముచ్చెత్తుతున్నా అనుకొన్న ముహూర్తానికే ఆ వధూవరులు ఆన్‌లైనులో వివాహం చేసుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. శిమ్లా జిల్లా కోట్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన ఆశిష్‌ సింఘాకు, కులు జిల్లాలోని భుంతర్‌ ప్రాంత యువతి శివానీ ఠాకూర్‌కు పెళ్లి జరిపించాలని కొద్దిరోజుల క్రితం పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలో ప్రకృతి విపత్తు రూపంలో ఈ వివాహానికి అడ్డంకి ఎదురైంది. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసం కావడంతో వధూవరులు కులులోని పెళ్లిమండపానికి చేరుకోలేకపోయారు. దీంతో ఆన్‌లైనులో పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. దా ఆశిష్‌, శివానీల వివాహం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరగ్గా, ఈ ఆన్‌లైన్‌ పెళ్లికి రెండువైపులా వధూవరుల బంధుమిత్రులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version