పాక్ యాంకర్.. కన్నీరు పెట్టుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపుదాడితో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. మరోవైపు ఈ దాడిని ఉద్దేశించి పాకిస్థాన్ యాంకర్ కన్నీరు పెట్టుకుంది. అయితే ఉగ్రవాదులపై దాడులు చేస్తే యాంకర్ ఎందుకు ఏడుస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పాక్ సర్కారే కాకుండా అక్కడి మీడియా కూడా ఉగ్రవాదులకు అనుకూలమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్‌కి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించారు. కల్నల్ సోఫియా ఖురేషీ – యునైటెడ్ నేషన్స్ శాంతి రక్షణ బృందానికి ఎంపికైన తొలి భారతీయ మహిళా ఆఫీసర్. యుద్ధ వ్యూహాలు రచించడంలో ఆమె దిట్ట. అలానే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ – భారత వైమానిక దళంలో అనుభవమున్న అధికారి. ఈ ఆపరేషన్‌లో ఆమె గగన తలంలో కీలక పాత్ర పోషించారు.
A Pakistani News Anchor Started Crying on Live TV after India's 🇮🇳 Operation Sindhoor against Pakistan 🇵🇰
~ What's your take on this 🤔 pic.twitter.com/BhJFkvih2C
— Richard Kettleborough (@RichKettle07) May 7, 2025