అధికార కాంగ్రెస్ పార్టీ మీద కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆ పార్టీలోకి రావాలని తనకు ఆహ్వానం వచ్చిందని అన్నారు. తనను కొనాలని చూశారని.. అయితే, తనను కొనాలంటే వాడి బాబులు, తాతలు దిగి రావాలని బుధవారం నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘నేను వేల మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ అని.. చిల్లర రాజకీయాలు చేయను.రాజకీయాలు ప్రజల కోసం చేయాలి.. కమిషన్ల కోసం కాదు. నేను నా గురించి చెప్పుకుంటా.. పక్కనోళ్ల గురించి చెడుగా చెప్పను. నాకు కావాల్సింది నా అక్క చెల్లెల్లు, నా రైతన్నలు బావుండడం’ అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.