కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు స్వదేశానికి ఆదిలాబాద్ వాసి

-

పని కోసం మలేషియాకు వెళ్లి మోసపోయిన రెడ్డి నాయక్ అనే వ్యక్తి ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బ్రోకర్ మోసం చేయడం వలన పని కోసం వెళ్లి మలేషియాలోనే తెలంగాణలోని ఆదిలాబాద్ రెడ్డి నాయక్ తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆయన స్వదేశానికి తిరిగి వచ్చేలా చొరవ చూపారు.

ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టారు. మలేషియాలో చిక్కుకున్న తనకు సాయం చేసి ఇంటికి తిరిగి వచ్చేలా చేసిన కేటీఆర్‌కు బాధిత రెడ్డి నాయక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదిలాఉండగా, గత వారం పరీక్ష రాసి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో రెడ్డి నాయక్ ఇద్దరు కూతుర్లు మంజుల(17), అశ్విని(19) మృతి చెందిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news