వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై చర్చ.. బీఏసీ భేటీ నుంచి విపక్షాల వాకౌట్‌

-

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుపై బుధవారం రోజున (ఏప్రిల్ 2వ తేదీ) లోక్‌సభలో చర్చ జరగనుంది.  8 గంటలపాటు ఈ అంశంపై చర్చ జరపాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం తర్వాత ఈ బిల్లుపై సభ ఆమోదం కోరనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపాయి.

అయితే ఈ సమావేశంలో పాల్గొన్న విపక్షాలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై 12 గంటల పాటు చర్చించాలని పట్టుబట్టినట్లు సమాచారం. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలనపై చర్చ జరగాల్సి ఉన్నందున 8 గంటల చర్చను ప్రభుత్వం సమర్థించుకున్నట్లు తెలిసింది. అయితే ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా ముస్లిం ప్రయోజనాలకు విఘాతమంటూ విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీ నుంచి వాకౌట్ చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. గతేడాది ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జేపీసీకి నివేదించగా.. జేపీసీ నివేదిక సమర్పించిన తర్వాత కమిటీ సిఫార్సుల మేరకు బిల్లులో పలు మార్పులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version