పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. ఆటపైనే దృష్టిపెట్టాలని షోయబ్ మాలిక్, కమ్రాన్ ఆక్మల్, అబ్దుల్ రజాక్ సూచించారు. ‘బాబర్ నాయకత్వంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అనుకున్న లక్ష్యాలను ఛేదించలేదు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఆటు ప్లేయర్ గా, ఇటు కెప్టెన్ గా విఫలమయ్యారు. అందుకే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలి’ అని వారు పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటె, పాకిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ మిక్కీ అర్థర్.. జట్టుకు అండగా నిలిచాడు. ప్రత్యేకించి- కేప్టెన్ బాబర్ ఆజమ్‌కు తన మద్దతు తెలిపాడు. కేప్టెన్‌గా బాబర్ ఆజమ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని వ్యాఖ్యానించాడు. ప్రతి రోజూ ఓ కొత్త పాఠాన్ని నేర్చుకుంటోన్నాడని, విమర్శలకు బదులుగా ఎదగడానికి అవకాశం కల్పించాలని అన్నాడు. బాబర్ ఓ అద్భుతమైన బ్యాటర్ అనే విషయం అందరికీ తెలిసిందేనని, కొన్ని సార్లు వైఫల్యాలు వెంటాడక తప్పవని మిక్కీ అర్థర్ చెప్పాడు.